'శాంతిభద్రతల విఘాతానికి వైసీపీ యత్నం'
AKP: రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతానికి వైసీపీ ప్రయత్నిస్తుందని హోం మంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. ఆదివారం పెంటకోట కన్వెన్షన్ హాల్లో డీసీఎంఎస్ ఛైర్మన్ బాలాజీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అది చూసి ఓర్వ లేకనే వైసీపీ బురద జల్లుతుందని మండిపడ్డారు.