VIDEO: త్రిపురాంతకంలో కొండచిలువ కలకలం
ప్రకాశం: త్రిపురాంతకం మండలంలోని పాత ముడివేములలో 10 అడుగుల భారీ కొండచిలువను శుక్రవారం స్నేక్ క్యాచర్ మల్లికార్జున చాకచక్యంగా పట్టుకున్నారు. పాత ముడివేములలోని రావులపల్లి శ్రీరాములు కోళ్ల ఫారంలో 3 కేజీల కోడిని మింగిన కొండచిలువను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకొని కొండచిలువను పట్టుకున్నారు.