రోడ్డుపై విరిగి పడిన చెట్టు కొమ్మ..!
VKB: బషీరాబాద్ మండల కేంద్రంలో బుధవారం వీచిన బలమైన గాలుల కారణంగా విద్యా వనరుల కేంద్రం ముందున్న రోడ్డుపై చెట్టు కొమ్మ విరిగిపడింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షాలు, వేగవంతమైన గాలులు ఉన్న సమయంలో పొడవైన చెట్ల కింద ఉండరాదని, వాటికి దూరంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.