తినే అన్నంలో కాళ్లు పెట్టిన వాచ్మెన్
SRD: విద్యార్థులు తినే అన్నం గిన్నెలో మద్యం మత్తులో ఓ వాచ్మెన్ కాళ్లు పెట్టి పడుకున్నాడు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాల వాచ్ మెన్ శేఖర్ బుధవారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి కిచెన్ గదిలో ఉన్న అన్నం గిన్నెలో కాళ్లు పెట్టి పడుకున్నాడు. దీంతో అధికారులు వాచ్మెన్ ను సస్పెండ్ చేశారు.