ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో హనుమాన్ జయంతి వేడుకలను ఆలయ కమీటి సభ్యులు గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోనే 26 అడుగుల ఎత్తైన అల్లంపురం ఆంజనేయ స్వామికి భారీ జనసందోహం మధ్య పూజలు చేశారు. స్వామివారికి గారెలు దండలుగా చేసి హస్తాలకు వేసి ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా 108 సార్లు పఠనం చేశారు.