ITI లో ATC ట్రైనింగ్ ప్రారంభం

NZB: భీమ్‌గల్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ATC ట్రైనింగ్ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. యువతను ఈ కోర్సుల్లో చేర్పించడానికి వివిధ కళాశాల ప్రిన్సిపల్స్, మండల అధికారులతో ఎంపీడీవో సంతోష్ కుమార్ అవగాహన సమావేశం నిర్వహించారు. యువత ATC(6) కోర్సులో చేరి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలను పొందాలని సూచించారు.