కన్న తల్లిని కడతేర్చిన కసాయి కొడుకు
JGL: తల్లిని కొడుకు హత్య చేసిన ఘటన మల్లాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కడుదుల వెంకు(88) అనే వృద్ధురాలిపై తన కొడుకు నంబయ్య శుక్రవారం రాత్రి దాడికి పాల్పడ్డాడు. దీంతో వృద్ధురాలికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.