మచిలీపట్నంలో జనసేన నేతల విభిన్న వైఖరి
కృష్ణా: మచిలీపట్నంలో జనసేన నేతల విభిన్న వైఖరిపై పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ కార్యకర్తకు సంబంధిచిన రూ.50 లక్షల విలువైన ఇల్లు కూల్చేస్తుంటే మౌనం పాటించడంపై పార్టీలో చర్చగా మారింది. గతంలో పేర్ని నాని ఇంటి వద్ద పార్టీ దిమ్మె కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసిన నేతలు, ఇప్పుడు స్పందిచకపోవడంతో దీని వేనుక మంత్రి రవీంద్ర భయం ఉందని జనసేన పార్టీలో వార్తలు వస్తున్నాయి.