పిడుగుపాటుకు దగ్ధమైన పూరి గుడిసె
PLD: వెల్దుర్తి మండలంలోని లోయపల్లి గ్రామంలో మంగళవారం పిడుగుపడి పూరి గుడిసె పూర్తిగా కాలిపోయింది. గ్రామానికి చెందిన మండ్లి నాసరయ్యకు చెందిన గుడిసెపై పిడుగు పడటంతో మంటలు చెలరేగి సర్వస్వం కాలి బూడిదయ్యింది. అదృష్టవశాత్తూ.. ప్రమాద సమయంలో గుడిసెలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు స్థానికులు తెలిపారు.