VIRAL: గణేష్ చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ

TG: జగిత్యాల జిల్లా కల్లెడ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. గణేష్ చందా ఇవ్వలేదన్న కోపంతో.. నాలుగు కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. నలుగురు యువకులు, వారి కుటుంబాలను గ్రామ కుల పెద్దలు బహిష్కరించారు. వారితో ఎవరైనా మాట్లాడితే రూ.25 వేలు జరిమానా అంటూ నిబంధన విధించారు. ఊర్లో డప్పు చాటింపు వేసి మరీ కుల బహిష్కరణ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో చూడాలి.