'హౌస్ లిస్టింగ్ ప్రక్రియ పగడ్బందీగా నిర్వహించాలి'
KNR: జనాభా గణనలో భాగంగా చేపట్టనున్న హౌస్ లిస్టింగ్, విలేజ్ మ్యాప్స్ ఫైనలైజేషన్ ప్రక్రియ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జనాభా గణనలో భాగంగా చేపట్టనున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియపై ఆర్డివోలు తహసిల్దార్లతో సమీక్ష నిర్వహించారు.