రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NGKL: ఊర్కొండ మండలం జకినాలపల్లి సబ్ స్టేషన్‌‌‌లో విద్యుత్ మరమ్మతుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ శ్రీనివాసులు తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని ఇప్పపహడ్, ఊర్కొండపేట, నర్సంపల్లి, జకినాలపల్లి, గుండ్లగుంటపల్లి గ్రామాలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని సూచించారు.