అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఏఎస్పీ

అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఏఎస్పీ

NRML: సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సాయికిరణ్ స్పష్టం చేశారు. కొందరు చిన్నపాటి గొడవలు, రోడ్డు ప్రమాదాలకు మత రంగు పూసి ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని, ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని ఆయన కోరారు.