రామసముద్రంలో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం

CTR: రామసముద్రం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు శనివారం నుంచి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభమైంది. మండల టీడీపి అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.