నూతన టన్నెల్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

నూతన టన్నెల్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

RR: రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకొని సరూర్‌నగర్ కట్టపై ఇటీవల నిర్మించిన నూతన టన్నెల్‌ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముంపు సమస్యను తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నామని, ప్రియదర్శిని పార్క్ మసీదు వద్ద గతంలో ఏర్పాటు చేసిన మూడు గేట్లకు తోడు మరో మూడు గేట్లు కూడా ఏర్పాటు చేశామన్నారు.