నెల్లూరుకు ఆ పేరెలా వచ్చిందంటే..?
NLR: జిల్లాకు నెల్లూరు అనే పేరు ఎలా వచ్చింది అనే దానిపై ప్రధానంగా రెండు వాదనలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వరి ఎక్కువ సాగు చేస్తుంటారు. తమిళ భాషలో 'నెల్' అంటే వరి అని అర్థం. అందుకే నెల్+ఊరు కలిసి నెల్లూరుగా మారిందని ప్రజలు నమ్ముతారు. స్థల పురాణం ప్రకారం పూర్వం ఒక ఉసిరి(నెల్లి) చెట్టు కింద శివలింగం వెలిసింది. ఆ చెట్టు పేరు మీదుగా నెల్లూరు అయిందని మరికొందరి అభిప్రాయం.