పుణ్యక్షేత్రాల దర్శనానికి టూరిజం రైలు

HYD: తీర్థయాత్రలకు ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. సికింద్రాబాద్ నుంచి పలు పుణ్యక్షేత్రాల దర్శనానికి గంగా-రామాయణ పుణ్యక్షేత్ర పేరుతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేక రైలును ప్రకటించింది. దీని ద్వారా వారణాశి, అయోధ్య, నైమిశారణ్యం వంటి ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. వివరాలకు IRCTCని సంప్రదించాలి.