VIDEO: వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు
MDK: రామాయంపేట మండల కేంద్రంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు గజ్వేల్ చౌరస్తా, మెదక్ చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు.