రోకలి బండతో దాడి.. చికిత్స పొందుతూ మృతి

రోకలి బండతో దాడి.. చికిత్స పొందుతూ మృతి

GNTR: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో రోకలి బండతో దాడి చేయడంతో ఒకరు మృతి చెందారు. దుగ్గిరాల మండలం మోరంపూడికి చెందిన కూచిపూడి గోపి అదే గ్రామానికి చెందిన నన్నెపాగ రఘునాథరావు తలపై రోకలిబండతో కొట్టడంతో తీవ్రంగా గాయపడి స్పృహకోల్పోయాడు. గాయపడిన రఘునాథరావును గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు.