మృతదేహాలు వెలికితీత

BPT: బల్లికురవ మండలం మల్లయ్యపాలెం గ్రామంలో ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ నందు ఆదివారం బండ రాళ్లు విరిగిపడి ఆరుగురు మృతి చెందిన నేపథ్యంలో ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. ఇప్పటికే బండ రాళ్లు కింద ఉన్న మృతదేహాలను బయటకు వెలికి తీశారు. ఇంకా ఎంతమంది చనిపోయారు అనేది తెలియాల్సి ఉంది.