కనుమరుగైన ఆయుర్వేద ఆసుపత్రి

కనుమరుగైన ఆయుర్వేద ఆసుపత్రి

MDK: కొన్ని దశాబ్దాల పాటు రామాయంపేటలో ప్రజలకు సేవలు అందించిన ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి నేడు కనుమరుగయింది. గత రెండు సంవత్సరాల క్రితం ఆయుర్వేద ఆసుపత్రి సిబ్బంది బదిలీపై వెళ్లారు. అప్పటినుండి నేటి వరకు కొత్త సిబ్బందిని ప్రభుత్వం నియమించలేదు. దీంతో ఆస్పత్రి మూతపడి సేవలు నిలిచిపోయాయి. ఆయుర్వేదంకు అలవాటు పడిన ఎంతోమంది సేవలు లభించకపోవడంతో ఆందోళనపడుతున్నారు.