ఉప్పల్ స్టేడియం వద్ద భారీ ఏర్పాట్లు.. 3 వేల మంది పోలీసులు
HYD: డీజీపీ శివధర్ రెడ్డి మెస్సీ మ్యాచ్ ఏర్పాట్ల పై సమీక్ష పూర్తయింది. ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సి స్టేడియంకు రానుండగా, భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు. కోల్‌కతాలో సాల్ట్ లేక్ ఘటనను డీజీపీ స్క్రీనింగ్ చేసి చూపించారు. కాగా, ఇప్పటికే స్టేడియం దగ్గర 3వేల మంది పోలీసు బలగాలను మోహరించారు.