ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

W.G: తణుకులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పలు వార్డులను సందర్శించిన ఆమె రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పలు విభాగాలను తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. వైద్యుల కొరతను అడిగి తెలుసుకున్న ఆమె సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు.