శ్రీవారిని దర్శించుకున్న హీరో నాగచైతన్య

TPT: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల తదితరులు గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. స్వామివారిని ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.