లారీ బోల్తా.. డ్రైవర్ ఆత్మహత్య

లారీ బోల్తా.. డ్రైవర్ ఆత్మహత్య

KRNL: ఆదోని మండల పరిధిలో బైచిగేరి క్రాస్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు వైపు వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. భయాందోళనతో లారీ డ్రైవర్ లక్ష్మన్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు.