ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన ఖరారు
AP: ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన ఖరారైంది. ఈనెల 19న రాష్ట్రానికి మోదీ రానున్నారు. సత్యసాయి శతజయంతి వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఈనెల 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా పుట్టపర్తికి రానున్నారు.