VIDEO: 'బాల కార్మికులు లేకుండా చూడాలి'
నిజామాబాద్ నగరంలోని 45వ డివిజన్ ఎల్లమ్మగుట్టలో బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా బాలల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు చైతన్య మాట్లాడుతూ.. బాల కార్మికులు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. భిక్షాటనలో కనబడినా సమచారం ఇవ్వాలన్నారు. 45వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణు గోపాల్, పరిరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.