పిల్లలతో కూలి పనులు.. నిధుల దోపిడి..?

RR: పాఠశాల నిర్మాణ సంబంధించిన పనులు కార్మికులు చేయాల్సింది పోయి, పిల్లలే కార్మికులైన పరిస్థితి నందిగామ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పడింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల పిల్లలతో పనులు చేయిస్తూ, పీఎం శ్రీ పథకం కింద వచ్చే నిధులను కాజేస్తూన్నట్లు స్థానికులు తెలిపారు. విద్య నేర్చుకోవాల్సిన పిల్లలతో పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు.