VIDEO: ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు: కమిషనర్
కాకినాడ నగరంలో డ్రైన్లు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం శాంతనపురి కాలనీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆయన, డ్రైన్లను ఆక్రమించిన వ్యాపారాలను తక్షణమే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. తాగునీటిని వృథాగా ఇళ్లు కడగడానికి వినియోగించడంపై మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలన్నారు.