VIDEO: మార్కాపురంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని 27వ వార్డులో ప్రజలు గురువారం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల ముందు మార్కాపురం జిల్లా ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే జిల్లా ప్రకటించడంపై స్థానిక ప్రజలు, ఎన్డీయే కూటమి నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యే నారాయణరెడ్డితో ఉన్న చిత్రపటాలకు పాలాభిషేకం చేసి చేశారు.