'వికాసం పాఠశాలలో మౌలిక వసతులు కల్పించండి'

ADB: ఉట్నూర్ వికాసం పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించాలని USFI జిల్లా కార్యదర్శి ఆత్రం నగేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన పాఠశాలను సందర్శించి అక్కడి సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులకు విద్య బోధనలు, క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన పేర్కొన్నారు. పీవో స్పందించి పాఠశాల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.