రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ

AKP: మునగపాక మండల ఉమ్మలాడ గ్రామంలో శుక్రవారం విశాఖ డెయిరీ పాల సెంటర్‌లో రైతులకు సబ్సిడీపై విత్తనాలును జనసేన పార్టీ మండల అధ్యక్షుడు టెక్కలి పరుశురాం చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉటుందని అన్నారు. కూటమి నాయకులు మొల్లేటి నారాయణరావు,మొల్లేటి ఆనంద్, పల్లె నర్సింగరావు పాల్గొన్నారు.