VIDEO: వీరవల్లిపాలెంలో ట్రాక్టర్ బోల్తా

కోనసీమ: అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడింది. బుధవారం కొబ్బరికాయల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌కు స్వల్ప నష్టం వాటిల్లిందని డ్రైవర్ తెలిపారు.