అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు మరువలేనివి
VZM: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు మరువలేనివని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం గంట్యాడ మండల పరిషత్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆయన పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమణమూర్తి, తహసిల్దార్ నీలకంఠేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.