'ఎరువులు అక్రమ వినియోగానికి అడ్డుకట్టు వేయాలి'
AKP: రాయితీపై రైతులకు పంపిణీ చేస్తున్న ఎరువులు అక్రమంగా వినియోగం కాకుండా చూడాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. మండల స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.