రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి

ADB: ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ససానే ఆకాష్ (26) ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఇచ్చోడ నుంచి నర్సాపూర్ వెళ్తుండగా సిరిచల్మ రోడ్డుపై చించోలి సమీపంలో ఆటో అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆకాష్‌ తలకు బలమైన గాయాలు అయ్యాయి. వెంటనే అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించేలోపే మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు.