పెళ్లికి ప్రియుడి నో.. అమ్మాయి ఆత్మహత్య
CTR: చౌడేపల్లి మండలం మిట్టపల్లెకు చెందిన గౌతమి (23) సోమల (M) కందూరుకు చెందిన కార్తీక్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారం రోజులుగా ఇరువురి మధ్య పెళ్లి విషయములో వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం గౌతమి మిట్టపల్లికి చేరుకుంది. మరోసారి కార్తీక్‌ను ఫోన్లో గౌతమి పెళ్లి విషయమై నిలదీసింది. అతను నిరాకరించడంతో గౌతమి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.