మహా చండి హోమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి
PPM: శంబర పోలమంబ అమ్మవారి ఆలయంలో 10వ మంగళవారం సందర్భంగా మహా చండి హోమం నిర్వహించారు. ఈ హోమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.