శబరి మాతా ఆశ్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ప్రతేక పూజలు

శబరి మాతా ఆశ్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ప్రతేక పూజలు

NZB: తాడ్వాయిలోని శబరీ మాతా ఆశ్రమాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దర్శించుకున్నారు. దత్తాత్రేయ జయంతి ఉత్సవాల్లో భాగంగా శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి, ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు శుక్రవారం ఆశ్రమాన్ని సందర్శించారు. ఆలయ నిర్వాహకులు శబరీ మాతాజీ ఆధ్యాత్మిక భావనల గురించి ఆయనకు వివరించారు. అమ్మవారిని దర్శించుకున్న ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు.