నా పేరు గంగూలీ కాకపోవచ్చు కానీ.. : లియాండర్‌ పేస్‌

నా పేరు గంగూలీ కాకపోవచ్చు కానీ.. : లియాండర్‌ పేస్‌

టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాను బెంగాలీ వ్యక్తిని కాదంటూ వస్తోన్న విమర్శలపై స్పందించారు. తాను బెంగాలీనేనా అని ప్రజలు అడిగితే బాధ కలుగుతుందన్నారు. తాను కోల్‌కతాలో పుట్టినట్లు చెప్పారు. తన పేరు గంగూలీ కాకపోవచ్చు కానీ.. తాను మాత్రం బెంగాలీనేనని తెలిపారు. తమ కుటుంబానికి పోర్చుగీస్ మూలాలు ఉన్నా.. తాము భారతీయులమేనని వెల్లడించారు.