VIDEO: దివ్యాంగుడికి ట్రై సైకిల్ అందజేసిన ఎమ్మెల్యే
కృష్ణా: తమలంపాడు గ్రామంలో సోమన మణికుమార్ గారికి దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా మంజూరు చేసిన బ్యాటరీ ఛార్జింగ్ ట్రై సైకిల్‌ను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా చేతుల మీదుగా ఇవాళ అందజేశారు. దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వారికి ఆత్మనిర్భరత కల్పించే దిశగా అన్ని విధాలుగా సహాయం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.