గాజులదిన్నె ప్రాజెక్టులోకి వరద రాక

గాజులదిన్నె ప్రాజెక్టులోకి వరద రాక

KRNL: గోనెగండ్ల ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా గాజులదిన్నె ప్రాజెక్టులోకి 2వేల క్యూసెక్కుల వరద నీరు చేరిందని ప్రాజెక్టు ఏఈ మహమ్మద్ ఆలీ ఆదివారం తెలిపారు. హంద్రీనీవా కాలువ నుంచి 1600 క్యూసెక్కులు, ఎల్లెల్సీ నుంచి 400 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి ప్రవేశించాయి. 4.5 టీఎంసీల నీరు సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 1.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది.