"దేశ అభివృద్ధిలో గ్రామాల పాత్ర"పై అవగాహన
W.G: ఆకివీడు మండలం దుంపగడప వీవీ గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో "భారతదేశం అభివృద్ధిలో గ్రామాల పాత్ర" అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి దుంపగడప గ్రామ కార్యదర్శి ఎం.పెద్దిరాజు వివరించారు. విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సంపాదించాలో కూడా ఆయన దిశానిర్దేశం చేశారు.