VIDEO: గుంతకల్లు రైల్వే డీజిల్ షెడ్ సమీపంలో అగ్నిప్రమాదం
ATP: గుంతకల్లు రైల్వే డీజిల్ షెడ్ సమీపంలో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.