ఒకే ఇంట్లో ఆరుగురికి పింఛన్..!
ATP: అనంతపురంలోని హమాలీ కాలనీలో ఒకే కుటుంబంలోని ఆరుగురు దివ్యాంగులకు పింఛన్లు అందుతుండటం MLA దగ్గుపాటి ప్రసాద్‌ను ఆశ్చర్యపరిచింది. సయ్యద్ కుటుంబంలో ఆరుగురూ మూగవారే కావడంతో ఒక్కొక్కరికి ₹6 వేల చొప్పున ₹36 వేలు అందించారు. అనంతరం మాట్లాడుతూ.. వారికి ఇల్లు కూడా మంజూరు చేసినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు దేవుడిలా ఆదుకున్నారని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.