రేపు సత్తుపల్లిలో భారీ బైక్ ర్యాలీ
KMM: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేపు సత్తుపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి హాజరుకానున్నారు. మాధురి ఫంక్షన్ హాల్ నుంచి వెంగళరావు నగర్ కాలనీ వరకు ర్యాలీ సాగనుందని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రకటించింది.