అసలుసభని వదిలేసి కొసరుసభలో గోలెందుకు జగన్..!

అసలుసభని వదిలేసి కొసరుసభలో గోలెందుకు జగన్..!

VZM: రాష్ట్ర శాసనసభకు హాజరు కాకుండా శాసన మండలిలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్సీలకు ఆదేశాలు ఇవ్వడం విచిత్రంగా ఉందని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. అసలు సభని వదిలేసి కొసరుసభలో గోల చేస్తే ఫలితాలు ఉండవని తెలియదా అని ఎద్దేవా చేశారు.