ట్యాగులు లేని బియ్యం.. నాణ్యతపై సందేహాలు

ట్యాగులు లేని బియ్యం.. నాణ్యతపై సందేహాలు

KNR: ఎండపల్లి మండలం చర్లపల్లిలో రేషన్ బియ్యం నాణ్యతపై లబ్ధిదారులు మండిపడ్డారు. మూడు నెలల స్టాక్‌గా వచ్చిన బియ్యం సంచులకు ట్యాగులు లేకపోవడంతో ఏ మిల్‌ నుంచి వచ్చిందో తెలియడం లేదన్నారు. బియ్యంలో పురుగులు, నూకలు అధికంగా ఉండడంతో పాటు సంచుల బరువు 3- 4 కిలోలు తక్కువగా ఉన్నట్లు తెలిపారు. గన్నీ సంచులు కూడా చిరిగినవే ఉన్నాయని ఆరోపించారు.