సూరిపల్లిలో బీఆర్ఎస్ కీలక సమావేశం
WGL: నెక్కొండ మండలం సూరిపల్లిలో ఇవాళ BRS గ్రామ కమిటీ అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో రానున్న GP ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేసే నాయకుడిని ఎంపిక చేయాలని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు.