గండికోటలో 14 TMCల నీటి నిల్వ

KDP: గండికోట జలాశయం వెనుక జలాల నీటి నిల్వ 14TMCలుగా ఉన్నట్లు జల వనరుల శాఖాధికారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమామహేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ముందుగా 26TMCల నీటి నిల్వ ఉండేది. వాటిని మైళవరం జలాశయం, పైడిపాలెం ఎత్తిపోతల పథకం, కమలాపురం చెరువులకు గతంలో పంపడంతో నీళ్లు తగ్గుతూ వచ్చాయన్నారు. ప్రస్తుతం గండికోటలో 14TMCల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.